
అఖండ 2' చూసి ఆనందించిన అఘోరాలు
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'అఖండ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అఘోరాలు థియేటర్ కి వచ్చి 'అఖండ 2' సినిమాను చూసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు సన్నివేశాలు చూసి, తమ సీట్ల నుంచి లేచి మరీ వారు సినిమాను ఆనందించారు. ఈ సంఘటన సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.




