TG: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి.