TG: బ్యాంకుల్లో రద్దీ, దూరం సమస్యలను అధిగమించేందుకు స్త్రీనిధి రుణాల వాయిదాలను ఇకపై తపాలాశాఖలో చెల్లించే అవకాశం కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, మంచి ఫలితాలు రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. చిరు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, గ్రామస్థాయిలో వివిధ అవసరాలకు ఈ రుణాలను వాడుకుంటున్నారు.