మహిళల వన్డే ప్రపంచకప్‌.. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ పోరు

17716చూసినవారు
మహిళల వన్డే ప్రపంచకప్‌.. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ పోరు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 9న విశాఖపట్నంలోని వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా, మూడో విజయంపై కన్నేసింది. అయితే, బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కనిపిస్తోంది. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటం భారత స్పిన్నర్లకు కలిసొచ్చే అంశం.

సంబంధిత పోస్ట్