
పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాల ఫలితాలు విడుదల
పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, జీడీఎస్, ఏబీపీఎం పోస్టులకు సంబంధించిన మొదటి షార్ట్‌లిస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. తపాలా శాఖ అధికారిక వెబ్సైట్లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచింది. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో 1,060, తెలంగాణలో 608 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి జీతం రూ.10,000 నుంచి రూ.29,380 వరకు ఉంటుంది.




