
ఏఐతో ఉద్యోగాలు ఖతం.. బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI)తో ఉద్యోగాలు పోతాయనే భయం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, AI ఆటోమేషన్తో వైట్-కాలర్ ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని, ఇది బ్లూ-కాలర్ ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే, AIతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని, ఉత్పాదకతను పెంచడంతో పాటు రోజువారీ పనుల నుంచి విముక్తి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. యువత AIని స్వీకరించి, తెలివిగా ఉపయోగించుకుంటే ఉపాధి సమస్యలు తగ్గుతాయని ఆయన సూచించారు.




