
కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్.. ఎక్స్‌లో సంచలన పోస్ట్ (వీడియో)
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “దళిత వాడల్లో గుడులు కట్టే ముందు పాఠశాలలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి. టీటీడీ నిధులతో స్వయంగా ఆలయాలను నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు సీఎం చంద్రబాబు ప్రమోషన్ చేసుకోవడం ఏమిటి?.. కాంగ్రెస్‌పై, నాపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ఛాందస వాదుల ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు” అని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.




