
ఏఐతో లక్షల ఉద్యోగాలు గల్లంతు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీల విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 2025లో ఇప్పటివరకు 218 టెక్ కంపెనీలు 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్, ఇంటెల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ముందున్నాయి. ఇక ఇండియాలో టీసిఎస్ చరిత్రలో మొదటిసారి 19,755మందిని తొలగించింది. టేకిలు ఎప్పుడూ ఉద్యోగాలు పోతాయని భయంభయంగా బతుకుతున్నారు.




