TG: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అపోహలను తొలగించి, మహిళల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.