ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారం

23159చూసినవారు
ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారం
తమిళనాడులో పూజలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు, మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. సేలం జిల్లా వాళపాడికి చెందిన విజయరాజ(50)ను అరెస్టు చేశారు. వినాయక చవితి చందాల కోసం వెళ్లిన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతడి ల్యాప్‌టాప్‌లో 50కి పైగా అశ్లీల వీడియోలు గుర్తించారు. పూజలకు వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి, వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసి రహస్య కెమెరాలతో చిత్రీకరించేవాడని, వాటిని డార్క్‌ వెబ్‌లో విక్రయించినట్లు వెల్లడైంది.

సంబంధిత పోస్ట్