TG: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంగళవారం యూరియా కోసం వచ్చి ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్యూ లైన్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవ పెరిగి చివరికి ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. కాగా, అక్కడ ఉన్న కొందరు రైతులు వారిని విడదీశారు. ఇటీవల మహబూబాబాద్‌లో యూరియా కోసం క్యూ లైన్‌లో ఇద్దరు మహిళలు కొట్టుకున్న విషయం తెలిసిందే.