మహారాష్ట్రలోని బీడ్‌లో ఇటీవల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ పోల్ అమర్చుతుండగా విద్యుత్ షాక్ తగిలి 32 ఏళ్ల కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేవలం ఐదు సెకన్లలోనే విద్యుత్ ప్రవాహానికి గురై ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన భయంకర దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సహ కార్మికుడు తృటిలో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. విద్యుత్ పోల్ పనుల సమయంలో లైన్ ఆఫ్‌లో ఉండాల్సిండగా కరెంట్ ఎలా పునరుద్ధరించారనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.