కార్మికులకు ఇకపై నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి జీతాలు

TG: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, కాంట్రాక్ట్ కార్మికులకు నగదు రూపంలో జీతం ఇవ్వడంపై నిషేధం విధిస్తూ జీవో జారీ చేసింది. ఏ రంగంలోనైనా శాలరీ నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే వేయాలని స్పష్టం చేసింది. కనీస వేతనాలను రెగ్యులర్‌గా పెంచుతూ సెలవు రోజుల్లో పనిచేస్తే డబుల్ జీతం ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. జీతాలు ఇవ్వకుండా థర్డ్ పార్టీ(కాంట్రాక్టర్) ఇబ్బంది పెడితే కంపెనీయే బాధ్యత తీసుకొని వేతనాలు చెల్లించాలని పేర్కొంది.
