తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (పారా) రన్నింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో అక్టోబరు 14న జరిగిన టీ20 మహిళల 200 మీటర్ల పరుగులో 24.62 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణం గెలుచుకుంది. రెండు రోజుల క్రితం 400 మీటర్ల పరుగులోనూ దీప్తి పసిడి పతకం సాధించింది. రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దీప్తి రికార్డు నెలకొల్పింది.