
నాలుగో T20.. భారత్ స్కోరు 167
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ (28), గిల్ (46), దూబే(22) సూర్య కుమార్(20) రన్స్ చేశారు. తిలక్ వర్మ(5), సుందర్(12), జితేశ్(3) విఫలమయ్యారు. ఆసిస్ బౌలర్లలో జంపా, ఎల్లిస్ చెరో 3 వికెట్లు తీశారు.




