
బాలకృష్ణకు మంత్రి పదవిపై టీడీపీలో ఆసక్తికర చర్చ
AP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు, పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న బాలయ్యకు ఈ పదవి దక్కాలని వారు కోరుతున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మందికి పదవులు ఇవ్వడం, బాలయ్య సినీ రంగ ప్రస్థానం, మంత్రి పదవితో వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు పదవి ఇచ్చే అవకాశం లేదని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.




