
పెళ్లి మండపంలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన యువతి
కర్ణాటకలోని చిక్కమగళూరులో పెళ్లి జరుగుతుండగా, అశ్విని అనే యువతి పెళ్లి మండపంలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది. గత 10 సంవత్సరాలుగా శరత్ తో ప్రేమలో ఉన్నానని, తనను నమ్మించి రూ. 4.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. శరత్ తో తనకు వివాహం జరిగిన 2 నెలలకే విడాకులు తీసుకున్నామని, అతను తనను మోసం చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిపింది. అతనిపై మూడు కేసులు పెట్టానని, అందుకు ప్రతీకారంగా తనపై దాడి చేపించాడని చెప్పింది.




