170 గంటల భరతనాట్యంతో ప్రపంచ రికార్డు (వీడియో)

10939చూసినవారు
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి రెమోనా ఎవెట్ పెరీరా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు మొత్తం 170 గంటల పాటు భరతనాట్యం చేసి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం 3 గంటలకు 15 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. 2023లో సుధీర్ జగపతి పేరున ప్రస్తుత రికార్డు 127 గంటలు ఉంది. ఆమె ఈ రికార్డును అధిగమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్