ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటైన హాంకాంగ్‌లో తీవ్ర గృహ సంక్షోభం నెలకొంది. ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, సాధారణ ఉద్యోగులు, గృహ కార్మికులు అట్టపెట్టెల వంటి 'కాఫిన్ హోమ్స్'లో నివసించాల్సి వస్తోంది. ముఖ్యంగా సెలవు దినాల్లో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా కార్మికులు అండర్‌పాస్‌ల కింద ఆశ్రయం పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేతనాలు కేవలం 7% పెరిగితే, ఇళ్ల ధరలు మాత్రం 239% పెరగడమే ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది.