తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ విగ్రహానికి ఓ అభిమాని ఇంట్లో పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే పార్టీ కార్యకర్త తన పూజా మందిరంలో విజయ్ బొమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రతిరోజూ హారతి ఇస్తూ మొక్కులు తీర్చుకుంటున్నాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సినీ నటులను దేవుళ్లలా పూజించే సంస్కృతికి ఈ ఘటనే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.