
పిల్లల ఆధార్ కార్డు తప్పనిసరి.. సెప్టెంబర్ 30 లోపు ఉచిత అప్డేట్
ప్రస్తుతం పిల్లలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఐదేళ్లలోపు వారికి బయోమెట్రిక్ లేకుండా బాల ఆధార్ ఇస్తారు. ఐదేళ్లు నిండిన తర్వాత బాల ఆధార్‌ను అప్డేట్ చేయకపోతే విద్యా, వైద్య, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇబ్బందులు వస్తాయి. తల్లిదండ్రులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఈ ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ సదుపాయంతో ఈ సేవ పొందవచ్చు.




