మధ్యప్రదేశ్‌లోని బినేకాలో తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న స్కూటీ, ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు యువతులు గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.