37 ఏళ్ల సేవలకు ప్రభుత్వ ఉద్యోగికి ఘన వీడ్కోలు

0చూసినవారు
37 ఏళ్ల సేవలకు ప్రభుత్వ ఉద్యోగికి ఘన వీడ్కోలు
ఆలేరు నియోజకవర్గంలో మంగళవారం గోపరాజు శ్రవణ్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి 37 ఏళ్ల పాటు అంకితభావంతో సేవలందించిన అనంతరం పదవీ విరమణ చేశారు. వెంకటాపురంలోని జీఎన్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య ఆయన సేవలను ప్రశంసించారు. 1990లో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి తుర్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పర్యవేక్షకుడిగా ఆయన పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబంతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్