యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో శుక్రవారం అర్హులైన పెన్షన్ దారులు తమకు సరైన సమయంలో పెన్షన్ అందడం లేదని నిరసన తెలిపారు. గత కొన్ని నెలలుగా పెన్షన్లు ఆలస్యంగా అందుతున్నాయని, దీనిపై అధికారులను ప్రశ్నించగా 'ఇస్తాం, ఇస్తాం' అని సమాధానం వస్తోందని, దీంతో ఆగ్రహించి ధర్నా చేపట్టామని పెన్షన్ దారులు తెలిపారు.