ఆలేరు: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

0చూసినవారు
ఆలేరు: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆలేరు మండలం కొలనుపాకలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలు ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి నిరుపేదలకు తక్షణమే గృహ వసతి కల్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్