
మరణంలోనూ మహోన్నతం.. ఆరుగురికి ప్రాణదానం!
నల్గొండ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు బత్తిని హరీష్ రోడ్డు ప్రమాదంలో మరణించినా, ఆయన తల్లి మహేశ్వరి చూపిన సామాజిక బాధ్యత, గుండె నిబ్బరం అభినందనీయం. తమ బిడ్డ ఇక లేడనే బాధలోనూ, హరీష్ కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించారు. మరణానంతరం కూడా తోటి మనుషుల జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ త్యాగం సమాజానికి స్ఫూర్తిదాయకం.




