ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మలగూడెం యాదయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూర్ ఏం మండలం కూరెళ్లలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశము దగ్గరికి వెల్లి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.