
నిరసనలకు సిద్ధం కండి.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు (వీడియో)
జూన్ 6న తాను భారత్‌కు రానున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం తెలిపారు. పరీక్ష నిర్వహణ లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో శాంతియుత నిరసన కార్యక్రమం చేపడతానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఢిల్లీలో చేపట్టనున్న ఈ నిరసనలో విద్యార్థులు, తన మద్దతుదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.




