చౌటుప్పల్: వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి

4చూసినవారు
చౌటుప్పల్: వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో మంగళవారం రాత్రి కోళ్ల ఫారం షెడ్లో డ్యూటీకి వెళ్లిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి, బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్న అతన్ని సహోద్యోగులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. మృతుడి అన్న కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.