తుర్కపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీ గ్రంథాలయం వద్ద మంగళవారం గణపతి మండపంలో గ్రామ సర్పంచ్ సోమల వెంకటేష్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. గణనాథునికి ప్రత్యేక పూజల అనంతరం కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. గణేష్ నవరాత్రుల్లో భక్తి కార్యక్రమాలతో పాటు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివకృష్ణ, ఉపసర్పంచ్ పల్లె నరేష్, భక్తులు పాల్గొన్నారు.