గుండాల: గీత కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలి

74చూసినవారు
గుండాల: గీత కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలి
యాదాద్రి జిల్లా గుండాల మండలం రామారంలో తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాడి చెట్ల పైనుండి పడి మరణించిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందవలసిన రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత సంవత్సరం జూలై 14 సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని ఇంతవరకు ప్రభుత్వం వారికి అందజేయడం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్