కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండల కేంద్రంలో
బీజేపీ మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని
మోదీ దేశ అభివృద్ధి, సంక్షేమం, రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన అంశాలను ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారని తెలిపారు.