గుండాలలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తోందని, తూకం వేస్తున్న బస్తాలకు ట్రక్‌షీట్ ఇచ్చినా మిల్లర్లు తరుగు పేరుతో తక్కువ చెల్లిస్తున్నారని రైతులు ఆరోపించారు.