రాజాపేట: చిన్న మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

1చూసినవారు
రాజాపేట: చిన్న మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామంలో గురువారం చిన్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని, సమ్మక్క సారలమ్మ అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్