యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఎస్. సాయిప్రసాద్(28) ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో చోరీలకు పాల్పడి జైలు జీవితం గడిపిన సాయిప్రసాద్, సెప్టెంబర్ 20న రహదారిపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి పరారయ్యాడు. సీసీకెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, కీసర మండలం కుందనపల్లి వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు.