వైద్య విద్యార్థిని ఖాతా నుంచి రూ.50 వేలు మాయం

1చూసినవారు
వైద్య విద్యార్థిని ఖాతా నుంచి రూ.50 వేలు మాయం
అధిక లాభాల ఆశతో ఓ వైద్య విద్యార్థిని ఆన్లైన్ మోసానికి గురైంది. యాదాద్రి జిల్లా బీబీ నగర్ కు చెందిన ఈ యువతి, జెమ్స్ హోమియోపతి కళాశాలలో చదువుతోంది. సోషల్ మీడియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల ప్రకటన చూసి మోసపోయింది. మొదట రూ.100 జమ చేయగా, రూ.190 తిరిగి వచ్చాయి. ఆ తర్వాత రూ.1000 పెట్టుబడికి రూ.2 వేలు రావడంతో, రూ.50 వేలు బదిలీ చేసింది. మరింత డబ్బు అడిగేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్