యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం, తుర్కపల్లి మండలంలో బుధవారం కొనసాగుతున్న సర్ ప్రక్రియను తహసీల్దార్ రవికుమార్ పరిశీలించారు. చోక్లా తండా, రాంపూర్ తండా, ఇంద్రనగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలించి, తప్పులను సరిచేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు పాల్గొన్నారు.