గరుడ వాహనంపై నరసింహుడి వైభవం

6చూసినవారు
గరుడ వాహనంపై నరసింహుడి వైభవం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య తిరువీధుల్లో ఊరేగించారు. భక్తుల జయజయ ధ్వానాలతో క్షేత్రం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్