యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత గ్రామంలోని ఈ జాతరలో పాల్గొన్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు, గ్రామ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.