యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గుంతలమయమైన ఎస్సీ కాలనీ రోడ్డు, అసంపూర్తిగా నిలిచిపోయిన కాల్వ పనుల కారణంగా స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారని నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆలయ ఉద్యోగి కాల్వలో పడి గాయపడటంతో నాయకులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.