తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తుల కోసం కొత్త అన్నప్రసాద కేంద్రం ఆదివారం ప్రారంభమైంది. యాదగిరికొండ కింద ఆధ్యాత్మిక వాడలో వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కేంద్రంలో ఒకేసారి 900 మంది భోజనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.