యాదగిరిగుట్ట: అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

0చూసినవారు
యాదగిరిగుట్ట: అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేసి, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారి ప్రతిభను ప్రోత్సహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్