యాదగిరిగుట్ట ఆలయ కార్యనిర్వాహణ అధికారిగా ఐఏఎస్ అధికారి భవానిశంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈవో గర్భాలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. గతంలో ఈవోగా పనిచేసిన వెంకట్రావు ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భవాని శంకర్ ను నియమించింది. ఆయన గతంలో తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.