యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం, ప్రధాన కలశం, భిందతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ చేసి, 108 కలశాలతో స్వయంభు మూర్తులను అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.