యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, అంగన్వాడి టీచర్లు చిన్నారుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, స్మార్ట్‌ఫోన్ల ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా అందించవచ్చని, డిజిటల్ విధానాల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా నమోదు చేసి పర్యవేక్షించవచ్చని తెలిపారు.