యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో ఈ పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి.