యాదగిరిగుట్ట: రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

0చూసినవారు
యాదగిరిగుట్ట: రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ప్రభాతవేళలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పరమశివుడిని కొలుస్తూ, ఆవు పాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి, విభూతితో అలంకరించి అర్చించారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్