యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

770చూసినవారు
యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి పౌర్ణమి సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాతవేళలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో అలంకరణ చేసి అర్చించారు.

సంబంధిత పోస్ట్