యాదగిరిగుట్ట: యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణం

0చూసినవారు
యాదగిరిగుట్ట: యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకళ్యాణాన్ని అర్చకులు శనివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపించిన అనంతరం, వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి, ఆగమశాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవం జరిపించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్