యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిత్య ఆర్జిత సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన నరసింహ హోమం అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.